Nirmala Sitharaman: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: దేశ భవిష్యత్ ఆశాజనకంగా ఉంది

Update: 2024-02-01 13:57 GMT

Nirmala Sitharaman: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 

Nirmala Sitharaman: లోక్‌సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. డిజిటల్ రూపంలోనే ఓటాన్ బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు. ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో మూడు నెలల పాటు కార్యకలాపాలు కొనసాగించేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం ఆనవాయితీగా వస్తోంది. మోడీ రెండో పర్యాయంలో ఇదే చివరి బడ్జెట్ కాగా.... నూతన పార్లమెంట్‌లో ఇదే తొలి బడ్జెట్ కావడం విశేషం.

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన నిర్మలా సీతారామన్... అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి అనుమతి తీసుకున్న అనంతరం పార్లమెంట్‌కు వచ్చిన సీతారామన్ కేంద్ర కేబినెట్ ముందు బడ్జెట్‌ను ఉంచారు. కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం 26.02 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల. అప్పుల మినహా 2023-24 ఏడాదిలో సవరించిన అంచనా రాబడి.. 27.56 లక్షల కోట్లు అని వెల్లడించారు. ట్యాక్సుల ద్వారా 23.24 లక్షల కోట్లు రాగా..మొత్తం బడ్జెట్ అంచనా వ్యయం 47.66 లక్షల కోట్లుగా తెలిపారు. వివిధ మార్గాల ద్వారా 30.80 లక్షల కోట్ల ఆదాయం చేకూరిందన్నారు నిర్మల. ఈ ఏడాది అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News