Cabinet Meeting: ప్రధాని నేతృత్వంలో రేపు కేంద్ర కేబినెట్ భేటీ
Cabinet Meeting: ఉదయం 10.30 గంటలకు కేబినెట్ సమావేశం
Cabinet Meeting: ప్రధాని నేతృత్వంలో రేపు కేంద్ర కేబినెట్ భేటీ
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ రేపు సమావేశం కానుంది. గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. మంగళవారం రోజున పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ సెషన్ నిర్వహణకు సంబంధించి చర్చ జరుగుతుందని సమాచారం.