Agriculture Loan: అన్నదాతలకు కేంద్రం తీపి కబురు..
Agriculture Loan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ రుణాల వడ్డీపై రాయితీ ప్రకటించింది.
Agriculture Loan: అన్నదాతలకు కేంద్రం తీపి కబురు..
Agriculture Loan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ రుణాల వడ్డీపై రాయితీ ప్రకటించింది. 3 లక్షల లోపు రుణాలకు ఒకటిన్నర శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. స్వల్ప కాల వ్యవసాయ రుణాలకు వడ్డీ రాయితీ పునరుద్ధరించనున్నట్టు ఆయన తెలిపారు. దీనివల్ల బడ్జెట్‌పై 34 వేల 856 కోట్ల ప్రభావం పడుతుందని వెల్లడించారు. వడ్డీ రాయితీ వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా బ్యాంకులు సైతం ఆర్థికంగా పుంజుకుంటాయన్నారు.