Budget 2024 Live Updates: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ప్రత్యక్ష ప్రసారం..

Budget 2024 Live Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు.

Update: 2024-02-01 05:38 GMT

Budget 2024 Live Updates: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ప్రత్యక్ష ప్రసారం..

Budget 2024 Live Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. అంతకుముందు బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

పార్లమెంట్‌లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

డిజిటల్ రూపంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌.. ప్రభుత్వ విధానం

పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరింది

రైతులకు కనీస మద్దతు ధర కల్పించాం

ప్రభుత్వ పథకాలు ప్రజలకే చేరవయ్యాయి

దేశంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి

గ్రామీణాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

నూతన సంస్కరణలతో పారిశ్రామిక వేత్తలు తయారయ్యారు

పీఎం జన్‌మన్ యోజన స్కీమ్‌ను గిరిజనులకు చేరవేశాం

కిసాన్ సమ్మాన్ నిధులను రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం

ఆర్థికసాయం అందిస్తూ రైతులకు అండగా ఉంటున్నాం

4 కోట్ల రైతులకు పంటల బీమా అందిస్తున్నాం

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో విద్యావిధానంలో మార్పులు తెచ్చాం

3 వేల ఐటీఆర్‌లను తీసుకొచ్చాం

7 ఐటీఆర్‌లు, 16 ఐఐఐటీలను ప్రారంభించాం

స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లను ప్రారంభించాం

పీఎం విశ్వకర్మ ద్వారా చేతివృత్తులవారిని ఆదుకుంటున్నాం

78 లక్షల మంది వీధివ్యాపారులకు ఆర్థికసాయం అందించాం

2047 నాటికి పేదరికం, అసమానతలు లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాం

జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్‌ఫార్మెన్స్

దేశ ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది

GST వంటి ట్యాక్స్ సవరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయి

కరోనా తర్వాత యుద్ధాలు, సంక్షోభాలతో సప్లయ్ మేనేజ్‌మెంట్ దెబ్బతిన్నది

ప్రపంచదేశాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి

భారత్ మాత్రం అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్తోంది

జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధికి రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం

బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉండే వారి సొంతింటి కల నెరవేరుస్తాం

వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం

మధ్యతరగతి ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం ప్రాధాన్యత ఇస్తాం

రూఫ్ టాప్ పాలసీ విధానం కింద.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

ఫిచరీస్ విభాగానికి ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది

రానున్న రోజుల్లో 55 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం

ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు

పాడిరైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం

దేశంలో కొత్తగా ఐదు సమీకృత పార్కులు

స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ

యువత కోసం లక్ష కోట్లతో కార్పస్ ఫండ్

517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు- నిర్మల

మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతోంది

41 వేల రైల్వేకోచ్‌లను వందేభారత్ సర్వీసుల కింద మార్పు

వందేభారత్, నమో భారత్‌తో రైల్వేవ్యవస్థ బలోపేతం

పౌరవిమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నాం

100 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం

ఆధ్మాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం- నిర్మల

టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్- నిర్మల

భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్ కారిడార్

మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు

లక్షద్వీప్ సహా మన దీవుల్లో పర్యాటక వసతులు కల్పిస్తాం

కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టిన కేంద్రం

ఏడాదికి రూ.7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి

కొత్త ట్యా్క్స్ విధానంలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు

ట్యాక్స్ పేయర్ల డబ్బును దేశాభివృద్ధికి ఉపయోగిస్తున్నాం

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రేట్లలో ఎలాంటి మార్పులు లేవు

ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ట్యాక్సుల్లోనూ లేని మార్పులు

టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వడ్డీ లేని రుణాలు

Full View


Tags:    

Similar News