Budget 2024-25: తగ్గనున్న బంగారం, వెండి ధరలు
Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్ 2024-25లో బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం 6 శాతం కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని ప్రతిపాదించింది.
Union Budget 2024-25: తగ్గనున్న బంగారం, వెండి ధరలు
Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్ 2024-25లో బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం 6 శాతం కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని ప్రతిపాదించింది. ప్లాటినంపై 6.4 శాతం తగ్గించనుంది. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. ఇది సామాన్యులకు ఊరటనిచ్చే అంశమే.
బంగారంపై భారత్ లో మహిళలకు మక్కువ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇటీవల కాలంలో బంగారం ధర తులం 70 వేల రూపాయాలు దాటింది. అయినా కూడా కొనుగోళ్లు నిలిచిపోలేదు. 2023 ఆర్ధిక సంవత్సరంలో 2.8 లక్షల కోట్ల విలువైన బంగారం దిగుమతి చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ 15 శాతం కింద రూ. 42 వేల కోట్లను చెల్లించాల్సి వచ్చింది.
కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం బంగారం కొనుగోళ్లకు ఊతమిచ్చే అవకాశం ఉందని బంగారం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు . తక్కువ ధరలతో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతాయని వారు చెబుతున్నారు. ప్రపంచంలో బంగారం నిల్వలున్న దేశాల్లో ఇండియాది 9వ స్థానం. దేశంలోని కేరళలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉంటాయి.