Children Aadhaar update: ఇక స్కూళ్లలోనే పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ఆప్‌డేషన్..2 నెలల తర్వాత రానున్న ప్రాజెక్ట్

Children Aadhaar update: పిల్లల ఆధార్ అప్ డేషన్‌కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్)గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.

Update: 2025-07-21 09:13 GMT

Children Aadhaar update: ఇక స్కూళ్లలోనే పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ఆప్‌డేషన్..2 నెలల తర్వాత రానున్న ప్రాజెక్ట్

Children Aadhaar update: పిల్లల ఆధార్ అప్ డేషన్‌కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్)గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఇక నుంచి విద్యార్దుల అప్ డేషన్‌ను స్కూళ్లలోనే దశలవారీగా చేపట్టాలని భావిస్తుంది. రెండు నెలల తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఉడాయ్ వెల్లడించింది. దీనికి సబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వివవాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ఏడు కోట్లమందికి పైగా పిల్లలు తమ వేలిముద్రలను ఆధార్ కోసం ఇవ్వాల్సి ఉంది. కానీ అవి ఇవ్వకపోవడంతో ఇక ఉడాయ్ సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తోంది. ఇక పిల్లల వేలిముద్రలను సేకరణకు స్కూళ్లకే బయోమెట్రిక్ యంత్రాలను పంపించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) ఆలోచన చేస్తుంది. మరో రెండు నెలలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, దశల వారిగా దాన్ని నిర్వహించాలని చూస్తుంది.

ప్రస్తుతం పసికందులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులకు వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోకుండానే ఆధార్ సంఖ్యను కేటాయిస్తున్నారు. వారికి ఐదేళ్లు వచ్చాక వీటిని ఇచ్చి అపడేట్ చేసుకోవాలి. కానీ ఏడేళ్లు వచ్చిన తర్వాత కూడా ఇలా చేసుకోనివారు ఆధార్ సంఖ్యలను ఉపయోగిస్తున్నారు. కానీ అపడేషన్ లేకపోతే అవి ఇక పనిచేయవని ఉడాయ్ నిబంధనలు చెబుతున్నాయి.

అపడేషన్ ఎలా చేసుకోవాలంటే..

5–7 వయసు మధ్య ఉన్న పిల్లలు ఉచితంగా ఆధార్ అప్ డేషన్ చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ఉన్న పిల్లలు రూ.100 లు చెల్లించి అపడేషన్ చేయించుకోవాలి. స్కూళ్లలో ప్రవేశాలు, ఫీజు చెల్లింపులు, స్కాలర్ షిప్‌లు పొందడం, పరీక్షలకోసం.. ఇలాంటివాటికి అన్నింటికీ అపడేషన్ ఆధార్ కార్డు ఉండాలి. అందుకే ఇక స్కూళ్లకే ఇక విద్యార్దుల వేలి ముద్రలు తీసుకోవాలని ఉడాయ్ ఆలోచిస్తుంది.

Tags:    

Similar News