జమ్మూ కాశ్మీర్‌లో రెండు అనుమానాస్పద కరోనావైరస్ కేసులు
జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగం శనివారం రెండు అనుమానాస్పద కరోనావైరస్ కేసులను నివేదించింది. ఇద్దరు వ్యక్తులు ఇటలీ మరియు దక్షిణ కొరియా లో పర్యటించినట్టు అధికారులు గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగం శనివారం రెండు అనుమానాస్పద కరోనావైరస్ కేసులను నివేదించింది. ఇద్దరు వ్యక్తులు ఇటలీ మరియు దక్షిణ కొరియా లో పర్యటించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉన్న నిర్బంధ కేంద్రానికి వారిని తరలించారు. ఇదిలావుండగా, ఇటలీ నుండి పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులల్లో ఇద్దరికి కరోనావైరస్ లక్షణాలు కనిపించాయని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ప్రకటించింది. దాంతో వీరిద్దరిని జిఎంసిహెచ్ అమృత్సర్‌లో చేర్పించారు.. వారి తుది నివేదికలు పూణేలోని ఎన్‌ఐవి నుండి వస్తాయని వైద్యులు తెలిపారు.
పంజాబ్ లో ఈ రెండు కేసులతోనే కరోనా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు 31 మంది కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,400 మందికి పైగా మరణించారు. 100,000 లక్షల మందికి వైరస్ సోకింది. ఈ వైరస్ 90 కి పైగా దేశాలలో వ్యాపించింది, ఇందులో ఏడు దేశాలు తమ మొదటి కేసులను శుక్రవారం నివేదించాయి.