Twitter: భారత ఐటీ రూల్స్‌కు ఓకే చెప్పిన ట్విట్టర్

Twitter: మే 28న స్పెషల్ ఆఫీసర్‌ను అపాయింట్ చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకు వివరణ

Update: 2021-05-31 11:05 GMT

ట్విట్టర్ (ఫైల్ ఇమేజ్)

Twitter: సోషల్ మీడియా కట్టడికి కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ఐటీ రూల్స్‌కు ట్విట్టర్ ఓకే చెప్పింది. ఈ చట్టం ప్రకారం ట్విట్టర్‌కు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రత్యేక అధికారిని మే 28న నియమించినట్లు ఢిల్లీ హైకోర్టు ముందు వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు కొత్త రూల్స్‌ను అంగీకరించాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేయాలంటూ ప్రతిపాదనలు పెట్టాయి. అయితే ఈ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం కాస్త మొండిగా వ్యవహరించింది. ఇప్పటికే మౌనం వీడిన ఫేస్‌బుక్ కేంద్ర ఐటీ నియమావళిని అంగీకరించడంతో తాజాగా ట్విట్టర్ కూడా ఓకే చెప్పింది.

Tags:    

Similar News