Twitter Gets NCPCR Notice: ఢిల్లీ మైనర్ బాలిక హత్యాచారం కేసులో వివాదం

Twitter Gets NCPCR Notice: ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల దళిత చిన్నారి కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించడం వివాదానికి దారి తీసింది.

Update: 2021-08-04 15:00 GMT

Twitter Gets NCPCR Notice: ఢిల్లీ మైనర్ బాలిక హత్యాచారం కేసులో వివాదం

Twitter Gets NCPCR Notice: ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల దళిత చిన్నారి కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించడం వివాదానికి దారి తీసింది. ఢిల్లీ పాత నంగల్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన చిన్నారికి హడావుడిగా అంత్యక్రియలు జరపడం కలకలం రేపింది. ఈ కేసులో కాటికాపరే దోషి అని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

చిన్నారి కుటుంబాన్ని ఇవాళ పరామర్శించిన రాహుల్ వారికి అండగా ఉంటానన్నారు. ఆ కుటుంబాన్ని కలుసుకున్న ఫొటోలను ట్విటర్ లో షేర్ చేశారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు ట్విటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారంటూ ఫైర్ అయింది.

Tags:    

Similar News