Tamil Nadu: సీఎం స్టాలిన్‌కు టీటీడీ ఆశీర్వచనాలు.. వివాదాస్పదమవుతున్న టీటీడీ పండితుల తీరు

Tamil Nadu: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఆయన నివాసంలో టీటీడీ వేదపండితులు ఆశీర్వచనాలు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

Update: 2021-05-11 07:17 GMT

Tamil Nadu: సీఎం స్టాలిన్‌కు టీటీడీ ఆశీర్వచనాలు.. వివాదాస్పదమవుతున్న టీటీడీ పండితుల తీరు

Tamil Nadu: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఆయన నివాసంలో టీటీడీ వేదపండితులు ఆశీర్వచనాలు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఎంతటివారైనా సరే దేవుడు దగ్గరకు వెళ్లి దర్శించుకోవాలనే సాంప్రదాయం ఉంది. అలా కాకుండా.. టీటీడీ వేదపండితులు కొత్త సాంప్రదాయానికి తెరలేపారన్న విమర్శలున్నాయి. తమిళనాడు కొత్త సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయన దంపతులకు ఆశీర్వచనం అందించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

టీటీడీ వేదపండితులు ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై రాజకీయ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఇది టీటీడీ ప్రతిష్టకే మచ్చ అంటూ భగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు ద్రవిడియన్ సీఎంలు ఎవరు కూడా తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాలేదని ఇప్పుడు వారి కోసం టీటీడీ పురోహితులు వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు స్టాలిన్ తండ్రి కరుణానిధి నాస్తికవాదాన్ని బలంగా నమ్మేవారని ఆయన ఏనాడు గుడికి వెళ్లిన సందర్భాలు లేవన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News