TTD: ఏంటయ్యా 'హనుమయ్య' ఈ గోల

TTD: హింపి ట్రస్ట్ లేఖపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీటీడీ.. సరైన ఆధారాలతో సమాధానం ఇచ్చింది.

Update: 2021-05-09 06:44 GMT

టీటీడీ దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

TTD: అస్సలే మాయదారి కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఒక పక్క ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఒక వేళ బెడ్లు దొరికినా ప్రాణవాయువు(ఆక్సిజన్) దొరక్క ఆ మహమ్మారికి బలైపోతున్నారు. వారిని పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు. హనుమంతుడు తెలుగువాడని ఒకరు….కాదని మరోకరు ఇలా పురాణ ఇతీహసాలకే సవాలు విసిరుతూ అగ్ని రాజేస్తున్నారు. ఈ సమయంలో ఇది అవసరమా హనుమయ్య. అందరూ ఏకతాటి పైకి వచ్చి కరోనా ను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు నాయనా హనుమయ్య.

తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ శ్రీరామనవమి రోజున ఆధారాలతో సహ ప్రకటించిన విషయం తెలిసిందే. టీటీడీ ప్రకటనపై కర్ణాటకలో హంపి శ్రీహనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తప్పుబడుతూ లేఖ రాసింది. ఈ లేఖకు తాజాగా టీటీడీ సమాధానం ఇచ్చింది. ఈ నెల 20లోగా హనుమాన్‌ జన్మస్థలం నిర్ధరించే ఆధారాలు తమకు పంపాలని కోరింది. హింపి ట్రస్ట్ లేఖపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీటీడీ.. సరైన ఆధారాలతోనే హనుమాన్‌ జన్మస్థలాన్ని ప్రకటించామని సమర్థించుకుంది.

ఈ మేరకు ప్రత్యుత్తరంలో కమిటీ సేకరించిన వివరాలను జతచేసింది. కరోనా వ్యాప్తి తగ్గాక చర్చకు ఆహ్వానిస్తామని లేఖలో పేర్కొంది. 'హనుమంతుడి జన్మస్థలం తిరుమల కొండలలోని అంజనాద్రే' అంటూ పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ఆధారాలతో టీటీడీ ప్రకటించింది. ఒక భక్తుడి వాట్సాప్ సందేశం ద్వారా తాము ఈ సంకల్పానికి పూనుకున్నామనీ, ఈ అంశంపై దాదాపు నాలుగునెలల పాటు కమిటీ లోతుగా పరిశోధించిందని టీటీడీ వెల్లడించింది.

ఈ పురణాల్లో వెంకటాచలాన్ని అంజనాద్రిగా వ్యవహరించారని.. ఈ వెంకటాచలాన్ని 20 పేర్లు ఉన్నాయన్నారు. అయితే, ఆంజనేయుడు జన్మించింది తమ ప్రాంతంలోనేనని కన్నడిగులు వాదిస్తున్నారు. టీటీడీ ప్రకటనపై కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంజనేయుని పుట్టుక ప్రాంతం హంపియే అనేందుకు ఆధారాలు ఉన్నాయని వారంటున్నారు. రాముడిని మొదటగా సుగ్రీవుడికి కర్ణాటకలోని పంపానది (తుంగభద్ర) ఉత్తర తీరాన హంపి సమీపంలో ఆనెగొంది పరిసరాలలో ఉన్న ఈ కిష్కింధలోనే హనుమంతుడు పరిచయం చేశాడని వాల్మీకి రామాయణం చెబుతోంది.

అన్ని పురాణాల్లో అంజనాదేవి వెంకటాచలానికి వచ్చారని ఉందని.. ఆకాశగంగ తీర్థం సమీపంలో అంజనాదేవి 12 ఏళ్లు తపస్సు చేశారని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. వాయుదేవుడి ఇచ్చిన ఫలాన్ని తిన్న అంజనాదేవికి హనుమంతుడు జన్మించారని వివరించారు. వేంకటేశ్వరస్వామి మహత్యం గురించి సేకరించిన అద్భుతమైన గ్రంథం వెంకటాచల మహత్యమన్నారు మురళీధర్ శర్మ. టీటీడీ ఎప్పుడో ఈ గ్రంథాన్ని ప్రచురించిందని.. శ్రీనివాసుడి నివాసమైన ఈ వెంకటాచలం గురించి 12 పురాణాల్లో వివరించారన్నారు.

Tags:    

Similar News