Trinamool Congress: టీఎంసీ ఎంపీ రాజీనామా.. మమతా బెనర్జీ తీరుని సహించలేకే..
Trinamool Congress: పార్టీ అధినేత్రి మమతకు సిర్కార్ లేఖ
Trinamool Congress: టీఎంసీ ఎంపీ రాజీనామా.. మమతా బెనర్జీ తీరుని సహించలేకే..
Trinamool Congress: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు. కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆదివారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. చాలానెలలుగా ఆమెతో మాట్లాడలేకపోయినందుకు నిరాశ చెందినట్లు తెలిపారు. అవినీతి అధికారులు టాప్ పోస్టింగ్‌లు పొందడం వంటి కొన్ని విషయాలను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు.