PM Modi: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు
PM Modi: పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకామిని కలిసిన మోడి
PM Modi: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు
PM Modi: మోడీ జపాన్ పర్యటనలో భాగంగా హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పి్ంచారు. హిరోషిమాలోని ఈ విగ్రహ ప్రతిమ చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది అన్నారు. శాంతి మరియు సామరస్యానికి సంబంధించిన గాంధేయ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి మరియు లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
అనంతరం మోడీ ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ & పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్‌తో హిరోషిమాలో టోమియో మిజోకామి ను కలిసారు. హిరోషిమాలో ప్రొఫెసర్ టోమియో మిజోకామితో సంభాషించడం చాలా ఆనందంగా మోడీ వెల్లడించారు. అతను జపాన్ ప్రజలలో భారతీయ సంస్కృతి మరియు సాహిత్యాన్ని ప్రాచుర్యం పొందేందుకు అనేక ప్రయత్నాలు చేసాడని మోడీ కొనియాడారు.