నాగాలాండ్‌లో గిరిజన సాంస్కృతికోత్సవ సంబరాలు.. గిరిజనోత్సవాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌

* ఘనంగా స్వాగతించిన నాగాలాండ్‌ సీఎం రియో, గవర్నర్ జగదీశ్‌... ధన్‌కర్‌కు గిరిజన సాంప్రదాయ పద్దతుల్లో సత్కారం

Update: 2022-12-02 03:01 GMT

గిరిజనోత్సవాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌

Hornbill Festival: నాగాలాండ్‌లో గిరిజన సాంస్కృతికోత్సవ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ ఉత్సవాల్లో పాలుపంచుకుని గిరిజన వేషధారణతో నిర్వాహకుల్లో ఉత్సాహం పెంపొందించారు. నాగాలాండ్ రాజధాని కోహిమా సమీపంలో కిసామాలో నాగా హెరిటేజ్ విలేజ్‌లో గిరిజన సాంస్కృతికోత్సవాలు నిర్వహించారు. భారత ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారిగా కోహిమా విచ్చేసిన జగదీప్ ధన్‌కర్‌కు నాగాలాండ్ ముఖ్యమంత్రి రియో, గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్‌ ముఖి ఘనంగా స్వాగతం పలికారు. సాంస్కృతికోత్సవంలో ధన్‌కర్‌కు నాగా తలపాగా, నాగా శాలువలతో సత్కరించారు. ఉత్సవాల సందర‌్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించి గిరిజనుల గౌరవమర్యాదలకు ఫిదా అయ్యారు. నాగాలాండ్ లో గిరిజన సంస్కృతి విభిన్నమైందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పేర్కొన్నారు. గిరిజనుల ప్రేమ, ఆప్యాయతలు గొప్పవని పేర్కొన్నారు.

Tags:    

Similar News