తల్లిదండ్రులుగా మారనున్న ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారిగా..
Trans Couple: కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్‌జెండర్ జంట శుభవార్త చెప్పింది.
తల్లిదండ్రులుగా మారనున్న ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారిగా..
Trans Couple: కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్‌జెండర్ జంట శుభవార్త చెప్పింది. మరి కొన్ని రోజుల్లో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే నెలలో జహద్ కు బిడ్డ పుట్టబోతున్నాడు. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారాడు. అయితే శిశువు కోసం జహాద్ తన గర్భాశయాన్ని తొలగించుకోలేదు. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట బుధవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించింది. 'తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్' అంటూ జియా పావల్ ఇన్‌స్టాలో రాసింది. బహుశా ఓ లింగ మార్పిడి జరిగిన పురుషుడు గర్భం దాల్చడం దేశంలో మొదటిదేమో అని క్యాప్షన్ లో పేర్కొన్నారు.