Aircraft Crashes: కూలిన విమానం.. గాయాలతో బయటపడిన మహిళా పైలెట్
Aircraft Crashes: బారామతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానం
Aircraft Crashes: కూలిన విమానం.. గాయాలతో బయటపడిన మహిళా పైలెట్
Aircraft Crashes: పూణె జిల్లాలో సాంకేతిక లోపంతో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో మహిళా పైలెట్ బయటపడింది. స్థానికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానం పూణె జిల్లాలోని ఇందూరు తాలుకా కడ్బన్‌వాడీలో విమానం కుప్పకూలింది. అయితే అది శిక్షణ విమానంగా ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక కారణంగానే కూలి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విమానం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.