Sabarimala: శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలో కిందపడి మరణించిన మహిళా భక్తురాలు
Sabarimala: శబరిమలలో దర్శనానికి భక్తులు పోటెత్తగా.. యాత్రలో అపశృతి చోటుచేసుకుంది.
Sabarimala: శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలో కిందపడి మరణించిన మహిళా భక్తురాలు
Sabarimala: శబరిమలలో దర్శనానికి భక్తులు పోటెత్తగా.. యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రద్దీతో క్యూలైన్‌లో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఓ మహిళ క్యూలో కిందపడి మరణించింది. మృతి చెందిన మహిళ కోజికోడ్ జిల్లా కోయిలాండికు చెందిన భక్తురాలిగా గుర్తించారు.
భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గంటల తరబడి భక్తులు లైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. దాంతో భక్తులు నడ పందల్ దగ్గర బారికేడ్ల పైనుంచి దూకి వెళ్లేందుకు ప్రయత్నించార. ఈ క్రమంలో భక్తుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాట లాంటి పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలో మహిళా భక్తురాలు మృతి చెందడంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.