కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా ఫ్లూ.. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్..

Tomato Flu: రెండేళ్లు గడిచినా కరోనా మహమ్మారి ఇంకా వదల్లేదు.

Update: 2022-05-15 09:53 GMT

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా ఫ్లూ.. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్..

Tomato Flu: రెండేళ్లు గడిచినా కరోనా మహమ్మారి ఇంకా వదల్లేదు. రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. దీనికి తోడు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కేరళలో బయటపడిన టమాటా ఫ్లూ మరింత భయపెట్టిస్తోంది. దీని వల్ల కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు టమాటా తినడం వల్లే ఈ వ్యాధి వ్యాపిస్తుందని అపోహలు తలెత్తాయి. అయితే టమాటా తినడానికి ఈ ఫ్లూ కి ఎటువంటి సంబంధం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ సోకిన వారికి చర్మంపై గుల్లలు, పొక్కులు, ఎర్రటి రంగులో గుండ్రంగా ఉంటాయి కాబట్టి ఈ వైరస్‌కి టమోటా ఫ్లూ లేదా టమోటా వైరస్ అని పేరు పెట్టారు.

కేరళలో వెలుగుచూసిన టమటా ఫ్లూ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకి వ్యాపించింది. ఫ్లూ కట్టడికి కేరళ, తమిళనాడు మధ్య రాకపోకలు సాగించేవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి చిన్న పిలల్లకి పరీక్షలు చేస్తున్నారు. ఈ వైరస్ సాధారణంగా సోకుతుందా లేదంటే చికెన్ గున్యా, డెంగ్యూ వంటివి సోకిన తరువాత వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న పిల్లలకు ఈ టమాటా ఫ్లూ సోకుతుందని డాక్టర్ రామ్ సింగ్ తెలిపారు. వ్యాధి లక్షణాలు సోకిన వారికి చర్మంపై ఎర్రటి గుల్లలు, బాడీ డీహైడ్రేషన్ అవ్వడం జరుగుతోందని చెప్పారు. టమోటా ఫ్లూ తో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఫ్లూ కావడంతో ఇంకా దీనిపై క్లారిటీ రాలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ తెలుగు రాష్ట్రాల్లో రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News