తోడు కోసం 2వేల కి.మీ నడిచిన పులి.. చివరకు..

Update: 2020-03-06 05:04 GMT

పక్షులు, జంతువులు ఆహరం కోసం వలస వెలతాయని మనకు తెలుసు. సీజన్ మారిన సమయంలో, స్థిరపడటానికి స్థలం కోసం, ఆహరం కోసం మరియు సహజీవనం చేయడానికి సంభావ్య భాగస్వామిని వెతుక్కుంటూ జంతువులు వెలుతాయి. అలా వెళ్లిన పులి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) పర్వీన్ కస్వాన్ ఇటీవల ట్విట్టర్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేసి.. అందులో భాగస్వామి కోసం 2000 కిలోమీటర్ల దూరం నడిచిన పులి కథను పంచుకున్నారు. అతను పులి కదలికను ట్రాక్ చేసే మ్యాప్‌తో పాటు పులి చిత్రాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

అందులో ఇలా వ్రాశాడు, 'అది తనకు తోడును కోరుకుంటూ అన్వేషణ ప్రారంభించింది. కాలువలు, పొలాలు, అడవులు, రోడ్లు, గుట్టలు అడ్డొచ్చిన ప్రతిదాన్ని దాటుకుంటూ వెతుకులాడుతోంది. ఎదురయ్యే ప్రతిప్రాంతాన్ని జల్లెడపడుతోంది. పగటి పూట విశ్రాంతి తీసుకుంటూ రాత్రి పూట మాత్రమే నడక సాగించింది. ప్రస్తుతం అది మహారాష్ట్రలోని ద్యాన్‌గంగాకు చేరింది' అని పేర్కొన్నారు. పులి యొక్క కదలికను వారు ఎలా మ్యాప్ చేసారో కూడా ఆయన అందులో రాశారు. అంతకుముందే అటవీ అధికారులు ఆ పులికి అమర్చిన జీపీఎస్‌ ద్వారా అది ప్రయాణించిన దూరాన్ని కనుకున్నట్టు పర్వీన్ కస్వాన్ తెలిపారు.

అంతేకాక ఆ పులి ఏ ప్రాంతాల గుండా నడించింది.. ఎక్కడెక్కడ ఆగింది.. అనే విషయాలను వివరిస్తూ మ్యాప్‌ను సైతం పంచుకున్నారు. ఆ పులి మొదటగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి బయలు దేరి జిల్లాలు జిల్లాలు దాటుకుంటూ అలుపెరగకుండా ప్రయాణించి చివరాఖరకు ద్యాన్‌గంగా అభయారణ్యానికి చేరుకుంది. అయితే అది కొంతకాలంగా ఒంటరిగా ఉంటోంది. తోడు కోసం ప్రయత్నించింది.. అది నివసిస్తున్న పరిసరాల్లో ఆడపులుల జాడ కనిపించలేదు.. దాంతో తోడు కోసం ఇలా వెతుక్కుంటూ 2 వేల కిలోమీటర్లు నడిచింది.

ఇదిలావుంటే ప్రస్తుతం ఆ పులి చేరుకున్న అభయారణ్యంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అది అక్కడ హాయిగా జీవించే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పులి తన భాగస్వామికోసం వెతుకలాడిన తీరుపై కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. కొంతమంది అయితే ఆ పులి వద్దకు వచ్చే ఆడపులి నిజంగా అదృష్టవంతురాలు అని ప్రసంశించడం విశేషం.  

Tags:    

Similar News