మహారాష్ట్ర చంద్రాపూర్‌లో పెద్దపులి కలకలం
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది.
మహారాష్ట్ర చంద్రాపూర్‌లో పెద్దపులి కలకలం
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. బల్లార్షా గ్రామ పరిధిలోని కార్వా బల్లార్షా అటవీ ప్రాంతంలో ఒక పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
అటువైపుగా వెళ్తున్న పర్యాటకులు పులి సంచరిస్తున్న దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలు ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతున్నాయి. పెద్దపులి అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా తిరుగుతుండటం చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.