Chennai Metro stations Renamed: మెట్రో రైల్వేస్టేషన్లకు మాజీ సీఎంల పేర్లు: ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం కీలక నిర్ణయం

Chennai Metro stations renamed: తమిళనాడులోని ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ‌ధాని చెన్నైలోని మూడు మెట్రో స్టేషన్లకు మాజీ సీఎంల పేర్లును పెట్టాలని నిర్ణయించింది

Update: 2020-07-31 13:15 GMT
metro stations

Chennai Metro stations renamed: తమిళనాడులోని ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ‌ధాని చెన్నైలోని మూడు మెట్రో స్టేషన్లకు మాజీ సీఎంల పేర్లును పెట్టాలని నిర్ణయించింది. మాజీ సీఎంల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం పళనిస్వామి తెలిపారు.సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలితల పేర్లును పెట్టాలని ప‌ళ‌ని స్వామి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిన‌ట్టు తెలుస్తుంది. అలందూర్ మెట్రోస్టేషన్‌కు అరిజ్ఞార్ అన్నా అలందూర్ మెట్రో, సెంట్రల్ మెట్రో స్టేష‌న్‌కు పురచ్చితలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ మెట్రో, సీఎంబీటీ మెట్రో స్టేషన్‌కు పురచ్చితలైవి డాక్టర్ జె జయలలిత సీఎంబీటీ మెట్రోగా పేర్లు మార్పు చేశారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు స్టేషన్ల పేర్లు మార్చినట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇకపై అధికారికంగా ఇవే పేర్లుతో పిలువ‌నున్నారు.

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు మొద‌టి ద‌శ‌లో ఈ మూడు స్టేష‌న్లు ప్ర‌ధాన‌మైన‌వి. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల సందర్భంగా ఐకానిక్ చెన్సై సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్‌కు ఏఐఏడీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎంజీఆర్ పేరు పెడతామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.     

Tags:    

Similar News