Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఆర్మీ జవాన్ల వీరమరణం
Jammu Kashmir: కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఆర్మీ జవాన్ల వీరమరణం
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నిన్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, ఆ తర్వాత వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది.
మరణించించిన సిబ్బంది చేతిలో ఉన్న నాలుగు ఏకే-47 రైఫిళ్లను ఓ ఉగ్రవాది లాక్కెళ్లాడు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన జవాన్లు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు వివరించారు. కాగా, ఏప్రిల్, మే నెలల్లో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పదిమంది జవాన్లు అమరులయ్యారు.