బుల్డోజర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు

ATM Machine: దేశవ్యాప్తంగా ఇటీవల బుల్డోజర్‌ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌, యూపీ, ఢిల్లీలో బుల్డోజర్‌ వివాదాస్పదమవుతోంది.

Update: 2022-04-25 11:30 GMT

బుల్డోజర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు

ATM Machine: దేశవ్యాప్తంగా ఇటీవల బుల్డోజర్‌ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌, యూపీ, ఢిల్లీలో బుల్డోజర్‌ వివాదాస్పదమవుతోంది. ఢిల్లీలో జహింగీర్‌పూర్‌లో కూల్చివేతల సందర్భంగా కూడా బుల్డోజర్లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. తరచూ వార్తల్లో నిలుస్తున్న బుల్డోజర్‌ను తాజాగా దొంగలు ఏటీఎంను ధ్వంసం చేయడానికి వినియోగించారు. సాధారణంగా ఏటీఎంను ధ్వంసం చేయడం అంత ఈజీగా కాదు ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏకంగా బుల్డోజర్‌నే తీసుకొచ్చారు. ఏటీఎంను బుల్డోజర్‌తో ధ్వంసం చేసిన ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దొంగల ధైర్యంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు నిరుద్యోగమే కారణమంటూ నిదించారు.

మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలోని నిర్మాణుస్యంగా ఉండే ఏటీఎం కేంద్రంలో మిషన్‌ను ఆదివారం అర్ధరాత్రి దుండగులు బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. అందులోని నగదు ఉంచే బాక్స్ణు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరా రికార్డు చేసింది. తలుపును ఆ తరువాత లోపలి మిషన్‌ను బుల్డోజర్ డిగ్గర్‌తో ధ్వంసం చేశారు. నగదును ఉంచే బాక్స్‌ను తీసుకెళ్లారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 4 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సీసీ కెమెరాల్లో పుటేజీల్లోని దృశ్యాలు చెబుతున్నాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దొంగల ధైర్యంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు నిరుద్యోగమే కారణమంటూ నిదించారు. ఇండియాలో ప్రతిభ పెరిగిందని వ్యంగ్యంగా కొందరు స్పందించారు. క్రిప్టో మైనింగ్‌ కాలం వచ్చేసిందని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంతో భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని పెరుగుతాయని మరికొందరు స్పందించడం గమనార్హం.

Tags:    

Similar News