ఉద్యోగులకు గమనిక.. మార్చి 31లోగా ఈ పథకంలో చేరండి..

ఉద్యోగులకు గమనిక.. మార్చి 31లోగా ఈ పథకంలో చేరండి..

Update: 2022-02-03 08:00 GMT

ఉద్యోగులకు గమనిక.. మార్చి 31లోగా ఈ పథకంలో చేరండి..

ABRY: ఉద్యోగులకు ఈ వార్త శుభవార్తనే చెప్పాలి. ఈపీఎఫ్‌లో సభ్యత్వం ఉండి 15000లోపు జీతం పొందుతున్న ఉద్యోగులు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనలో చేరడానికి చివరితేదీ పొడిగించారు. ఇప్పుడు వీరు మార్చి 31, 2022లోపు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) తెలియజేసింది. గత సంవత్సరం కోవిడ్ రికవరీ దశలో ఉపాధిని ప్రోత్సహించడానికి, కొత్త ఉపాధి అవకాశాల కల్పనను సృష్టించడానికి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభించారు. ఇందులో రూ.15,000 లోపు జీతం ఉన్న వారికి ప్రయోజనం ఉంటుంది. EPF, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం పని చేస్తున్న కొత్త సంస్థలు, కొత్త ఉద్యోగులు మార్చి 31, 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు.

15,000 లోపు జీతం ఉన్నవారికి ప్రయోజనం

ఒక కొత్త ఉద్యోగి EPFO నమోదిత సంస్థలో పని చేయడం ప్రారంభించి, రూ. 15,000 కంటే తక్కువ జీతం పొందినట్లయితే అతను ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతాడు. 1 మార్చి 2020 నుంచి 30 సెప్టెంబర్ 2020 మధ్య ఉద్యోగం కోల్పోయి అక్టోబర్ 1 తర్వాత మళ్లీ ఉద్యోగం పొందిన వారు కూడా ఈ పథకం ప్రయోజనం పొందుతారు. అలాంటి ఉద్యోగుల జీతం కూడా నెలకు రూ.15,000 లోపు ఉండాలని గుర్తుంచుకోండి. ABRY కింద కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు ఉద్యోగులు, యజమానుల వాటా (ఆదాయంలో 24 శాతం) అందిస్తుంది. ఇది EPFO నమోదు చేయబడిన మొత్తం ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

ABRY పథకం లక్షణాలు

EPFOలో రిజిస్టర్ అయిన అర్హతగల సంస్థల కొత్త ఉద్యోగులు, యజమానులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 2 సంవత్సరాల పాటు ప్రోత్సాహకం లభిస్తుంది. 1000 మంది ఉద్యోగులను నియమించే సంస్థల్లో పని చేస్తున్న కొత్త ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు, యజమానులు ఇద్దరి సహకారం అందుతుంది. రూ.15,000 కంటే తక్కువ నెలవారీ జీతం తీసుకుంటున్న కొత్త ఉద్యోగులు, రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 24 వేతన నెలల వరకు ప్రయోజనాలను పొందడానికి అర్హులవుతారు.

Tags:    

Similar News