పేద ప్రజలకి పెద్ద ఊరట.. ప్రభుత్వం ఆ పథకాన్ని పొడిగించింది..!

PMGKAY: పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం పేదలకి ఉచితంగా రేషన్ అందజేస్తోంది.

Update: 2022-07-04 12:56 GMT

పేద ప్రజలకి పెద్ద ఊరట.. ప్రభుత్వం ఆ పథకాన్ని పొడిగించింది..!

PMGKAY: పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం పేదలకి ఉచితంగా రేషన్ అందజేస్తోంది. కరోనా నుంచి ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పూటలా రోటీ కూడా దొరకని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి ప్రభుత్వం గడువును పొడిగించింది.

ఉచిత రేషన్ పథకం గడువును ఈ ఏడాది మార్చి నెలలో మోడీ ప్రభుత్వం పొడిగించింది. 80 వేల కోట్లతో పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచితంగా అందజేస్తోంది. ఇంతకు ముందు ఈ పథకం చివరి తేదీ 31 మార్చి 2022. అయితే ఈ పథకాన్ని 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించారు. పేద వర్గాల ప్రజలు ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

కోవిడ్-19 కారణంగా పేద ప్రజలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని తీసుకొచ్చింది. అదే సమయంలో గత రెండేళ్లలో ఈ పథకం కింద ఇప్పటికే 2.6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మార్చిలో ఈ పథకాన్ని ఆరు నెలల పాటు పొడిగించారు. దీని వల్ల ఈ పథకానికి మరో 80,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. మార్చి 2020లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PM GKAY) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికింద లబ్ధిదారులకు నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది.

Tags:    

Similar News