Budget 2023-24: నేటి నుంచే కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు.. ఉన్నతాధికారులతో సమావేశం
Budget 2023-24: నిధుల గురించి సమావేశంలో చర్చ.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు
Budget 2023-24: నేటి నుంచే కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు.. ఉన్నతాధికారులతో సమావేశం
Budget 2023-24: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కసరత్తు ప్రారంభమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. సవరించిన బడ్జెట్ ఖర్చులతోపాటు వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలకు కావలసిన నిధుల గురించి ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ముంచుకొస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశాల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ వ్యాపార, వాణిజ్య వర్గాలతో సమావేశమై... వారి విన్నపాలు, సూచనలు స్వీకరిస్తారు.