దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసులలో 89 శాతం కేసులు తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో నమోదవుతున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పుడు చేస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, కరోనా వైరస్ బారిన పడిన వారు త్వరగా గుర్తించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ దేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లతో ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ మరియు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ .
72 గంటల లోగా ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న 80 శాతం కేసులను గుర్తించి వారితో సన్నిహితంగా మెలిగిన లేదా వారిని కలిసిన వారికి పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 89 శాతం కేసులు నమోదు అవుతున్న తొమ్మిది రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కూడా ప్రతిరోజు 10 లక్షల జనాభాకు 140 పైగా టెస్టులను తప్పనిసరిగా నిర్వహించి తీరాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కరోనా పాజిటివ్ రేటును 5 శాతానికి దిగువకు ఈ తొమ్మిది రాష్ట్రాల్లో లో సాధ్యమైనంత త్వరగా తగ్గించాలని కేంద్రం సూచన చేసింది.