Good News to Farmers: రైతన్నలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

* 2022-23 ఏడాదికి రబీ పంటల మద్దతు ధర పెంపునకు ఆమోదం

Update: 2021-09-08 13:00 GMT

రైతులకు తీపికబురు తెలిపిన కేంద్ర కెబినెట్ (ఫోటో ది హన్స్ ఇండియా )

Good News to Farmers: దేశ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్‌లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం మేలు చేయనుంది. వేర్వేరు పంటలకు కనీసం 40 నుంచి 400 వరకు కనీస మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా గోధుమలు, బార్లీ, శనగలు, ఎర్ర పప్పు, ఆవాలు, కుసుమలపై కనీస మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2022-23 మార్కెటింగ్ సీజన్‌కు ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తిస్తాయి. క్వింటాల్‌కు 40 నుంచి 400 వరకు కనీస మద్దతు ధర పెరగడం రైతులకు మేలు చేయనుంది.

మరోవైపు టెక్స్‌టైల్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గ్లోబల్ టెక్స్‌టైల్స్ ట్రేడ్‌లో భారత్ తర ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. పీఎల్‌ఐ పథకం ద్వారా 7.5 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా, మరింత మందికి పరోక్షంగా ఉపాథి పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం ముఖ్యంగా గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలపై సానుకూలంగా ప్రభావం చూపనుందని కేంద్ర కేబినెట్ తెలిపింది.

Tags:    

Similar News