Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు.. ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Jammu And Kashmir: ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్న బలగాలు

Update: 2023-08-10 06:20 GMT

Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు.. ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ముందు వరుస దాడులకు తెగబడుతున్నారు. మొన్న ముగ్గురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. ఆ తర్వాత క్రమంగా చొరబాట్లకు పాల్పడుతూనే ఉన్నారు. రీసెంట్‌గా సౌత్‌కశ్మీర్‌లో గ్రెనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దర ఆర్మీ జవాన్లు, ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే బారాముల్లాలో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది ఆర్మీ. భారీ మొత్తంలో మారణాయుధాలు స్వాధీనం చేసుకుంది.

ఈనెల 5న కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు చిక్కినట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. అది గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై దాడికి తెగబడ్డారు. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోగా.. ఆ తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

ఈనెల 6, 7న కూడా చొరబాట్లకు యత్నించారు ఉగ్రవాదులు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ దేశంలో అలజడి సృష్టించేందుకు చొరబాట్లు జరుగుతాయని ఇంటిలిజెన్స్‌ సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు బోర్డర్‌లో గస్తీ పెంచాయి. అయితే ఈనెల 6న ఉగ్రవాదులు బోర్డర్ దాటి కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిని నిలువరించగా.. ఓ ఉగ్రవాది మరణించాడు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మరోసారి చొరబాటుకు యత్నించారు ఉగ్రవాదులు. పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో ముగ్గురు చీకటి ముసుగులో చొరబాటుకు యత్నించారు. గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దాంతో అటు నుంచి ఉగ్రవాదులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో భారత సైనికులు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎదురుకాల్పులు జరిపి చొరబాటు యత్నాన్ని విఫలం చేశారు. 

Tags:    

Similar News