ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
* ఢిల్లీలో భారీగా బలగాల మోహరింపు * ఎర్రకోట దగ్గర పోలీసు బలగాల బందోబస్తు * ఢిల్లీ ప్రధాన ప్రాంతాలలో పోలీసుల గస్తీ
Representational Image
ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధానిలో భారీగా బలగాలు మోహరించారు. దాదాపు 15 కంపెనీల పారామిలటరీ బలగాలు ఢిల్లీలో గస్తీ కాస్తున్నాయి. ఎర్రకోట దగ్గర పోలీసు బలగాల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్లు మూసివేశారు. రైతుల దీక్ష శిబిరాల దగ్గర భద్రతను పెంచారు హింసాత్మక ఘటనలో 17 కేసులు నమోదు చేసినట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు. అల్లర్లు చెలరేగే ప్రాంతంలో ఈ సాయంత్రం 5గంటల వరకు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.