TOP 6 News @ 6PM: 'యాదగిరిగుట్టకు 18 మంది సభ్యులతో బోర్డు'

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పున: ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-03-18 12:31 GMT

TOP 6 News @ 6PM:యాదగిరిగుట్టకు 18 మంది సభ్యులతో బోర్డు

1.18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట బోర్డు

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో ఈ విషయాన్ని సురేఖ చెప్పారు. 18 మందితో యాదగిరిగుట్ట బోర్డు ఉంటుందని తెలిపారు. ఈ బోర్డు సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. వీరికి ఎలాంటి జీత భత్యాలు ఉండవని మంత్రి తెలిపారు.ఈ బోర్డుకు ఐఎఎస్ అధికారి ఈవోగా ఉంటారని ఆమె వివరించారు.

2.ఏప్రిల్ 15న అమరావతి రాజధాని నిర్మాణ పనుల పున: ప్రారంభం

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పున: ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15న ప్రధాని మోదీతో అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు. సీఆర్‌డీఏ అధికారులతో రాజధాని నిర్మాణ పనుల పున: ప్రారంభంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల

3.కాల్పుల విరమణకు ఒప్పుకోనందుకే హమాస్ పై దాడులు: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్

కాల్పుల విరమణకు ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. గాజాపై టెల్ అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇప్పటివరకు కనీసం 330 మంది మృతి చెందినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. చనిపోయిన వారిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్టు ఏజెన్సీ తెలిపింది.

4.ప్రజాస్వామ్య దేశం పోలీస్ రాజ్యంలా పనిచేయకూడదు: సుప్రీంకోర్టు

ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పని చేయకూడదని సుప్రీంకోర్టు హితవు పలికింది. ట్రయల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తైనా బెయిల్ పిటిషన్లను తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒక చిన్న కేసులో బెయిల్ కోసం దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడమనేది దిగ్భ్రాంతి కలిగిస్తోందని జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

5.బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మందికి పంజాగుట్ట పోలీసుల నోటీసులు

బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మందికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 18 సాయంత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు రవాలని నోటీసులు ఇచ్చారు. విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు పంపారు.

6.ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం ప్రవేశపెట్టారు. గ్రూపు-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్ కల్పించారు. గ్రూప్-2 లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. గ్రూప్-3 లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.


Tags:    

Similar News