CM KCR: మరోసారి థర్డ్‌ ఫ్రంట్‌ వైపు సీఎం కేసీఆర్‌ అడుగులు

*దేశ రాజకీయాల ముందుకు మళ్లీ మూడో కూటమి *తెలంగాణ వరి కొనే ప్రభుత్వాలకే మద్దతంటున్న సీఎం

Update: 2021-12-14 03:45 GMT

ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశం

CM KCR: సీఎం కేసీఆర్‌ మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ వైపు అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొందరు టీఆర్ఎస్‌ ముఖ‌్య నేతలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించే వరకు టీఆర్ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. రైతు వ్యతిరేక ప్రభుత్వం తమకు అవసరం లేదనే నినాదంతో.., బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకుపోయే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

తెలంగాణ వరి కొనే ప్రభుత్వాలకే టీఆర్ఎస్‌ మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పడానికి కేసీఆర్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మరోసారి థర్డ్‌ఫ్రంట్‌ ప్రయత్నాలకు తెర తీసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడో కూటమిని దేశ రాజకీయాల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. గతంలో లాగా ఈసారి వెనక్కి తగ్గకూడదని కేసీఆర్‌ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మోడీ విధానాలను వ్యతిరేకించే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల అధినేతలను కలవాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌ తమిళనాడుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్‌ను కలుసుకోవడం ఇది రెండోసారి. ఇక ఈ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చిస్తారో అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి థర్డ్‌ ఫ్రంట్‌ తీసుకురావడానికి ఇదే మంచి సమయమని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News