TOP 6 NEWS @ 6PM: మోదీ గురించి నేనలా అనలేదు... ఢిల్లీలో రేవంత్ రెడ్డి

Update: 2025-02-15 12:37 GMT

CM Revanth Reddy

1) పరుగెత్తాలని ఉంది... కానీ...

జీరో పావర్టీ తన జీవిత ఆశయం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. "పేదరికం లేని సమాజాన్ని చూడలనేదే తన కల అని ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతుండే వారు. అందుకే ఆయన కలను నిజం చేయాలని తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాను" అని చంద్రబాబు చెప్పారు. అందుకోసం ఈ సంవత్సరం P4 అనే పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. P4 అంటే పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని అర్థం వివరించారు. ఈ పీ4 ద్వారా ప్రజల ఆదాయం పెంచి పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ప్లాంట్ ప్రారంభోత్సం సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

తను అధికారంలోకి వచ్చాకా గ 8 నెలలుగా ఎప్పుడూ చేయనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి విషయంలో అన్నీ చేయాలని ఉందన్నారు. పరుగెత్తాలని ఉందన్నారు. కానీ గల్లాపెట్టె ( రాష్ట్ర ఖజానా) మాత్రం సహకరించడం లేదన్నారు. కానీ ఇదంతా తాత్కాలికమైన ఇబ్బందే అన్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించే శక్తి తనకు ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, నేరాలు పెరిగిపోయాయని చంద్రబాబు నాయుడు అన్నారు. తమ ప్రభుత్వం అలాంటి నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

2) వారి విషయంలో రెడ్ బుక్ అమలవుతుందన్న మంత్రి నారా లోకేశ్

2019-24 వరకు ఆనాటి ప్రభుత్వం ఎలా పాలించిందో అందరికీ తెలుసునని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇదేం అన్యాయం అని ప్రశ్నించినందుకు టీడీపీ నేతలపై కేసులు పెట్టారని లోకేశ్ గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రతీరోజు ఏదో ఒక చోట టీడీపీ నేతలపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి జైలుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇవే కాకుండా టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయన్నారు.

అందుకే ఏ అధికారులు, వైసీపీ నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారో.. వారిపై టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ అమలు చేస్తామని తాను యువగళం యాత్రలోనే చెప్పానన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా అలాంటిదేనని లోకేశ్ అన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును వెనక్కు తీసుకోవాల్సిందిగా బెదిరిస్తూ దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యారని ఆయన చెప్పారు.

3) మోదీ గురించి నేనలా అనలేదు...

ప్రధాని మోదీని కులం విషయంలో తాను వ్యక్తిగతంగా దూషించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ పుట్టుకతోనే బీసీ కాదని మాత్రమే అన్నానని తెలిపారు. కానీ తన మాటలను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని చెప్పారు. ఆయన పుట్టుకతోనే బీసీ కాదు కనుక వారి సమస్యలు కూడా పట్టవని రేవంత్ ఆరోపించారు. మోదీని కులం పేరుతో మాట్లాడుతున్నారని బీజేపి నేతలు చేస్తోన్న ఆరోపణలకు వివరణ ఇస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తాము కోర్టు చెప్పినదాని ప్రకారమే ముందుకెళ్తామని అన్నారు.

4) Indiramma Housing Scheme: ఇందిరమ్మ హౌసింగ్ స్కీంపై అదిరపోయే అప్ డేట్.. వాళ్లకి రూ.లక్ష జమ

Indiramma Housing Scheme: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వ విధానం ప్రకారం, స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇచ్చే ప్రతిపాదనపై ఇప్పటికే పని జరుగుతుంది. జనవరి 21వ తేది నుంచి ప్రారంభమైన ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం వారికి రూ.లక్ష నగదును జమ చేయనుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) అమెరికా విమానాలు అమృత్‌సర్‌లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు.. పంజాబ్ సీఎం అనుమానాలు

అమెరికా తమ దేశంలో ఉంటున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కు పంపిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అమెరికా నుండి 119 మంది భారతీయులతో రెండో విమానం ఇండియాకు బయల్దేరింది. శనివారం రాత్రి 10 గంటలకు ఆ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అవనుంది. అమెరికా నుండి వస్తోన్న రెండో మిలిటరి విమానంలో ఏయే రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారంటే.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Abki Baar Trump Sarkar: తగ్గనున్న ఫారిన్ బ్రాండ్ల ధర.. ఆనందంలో మునిగి తేలుతున్న మందుబాబులు..!

Abki Baar Trump Sarkar: భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నిర్ణయం ప్రకారం.. భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే విదేశీ మద్యం బ్రాండ్లపై విధిస్తున్న టారిఫ్‌ను తగ్గించింది. అయితే, ఈ టారిఫ్ తగ్గింపు ప్రత్యేకంగా బార్బన్ విస్కీలకు మాత్రమే వర్తిస్తుంది. గతంలో 150 శాతం ఉన్న ఈ పన్నును 100 శాతానికి తగ్గించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల, ఇండియాలో బార్బన్ విస్కీ ధరలు సరిగ్గా తగ్గనున్నాయి.

భారత ప్రభుత్వం ఈ టారిఫ్‌ను అధికంగా పెట్టడానికి కారణం, విదేశీ మద్యం దేశీయ మార్కెట్లోకి ప్రవేశిస్తే, దేశీయ మద్యం బ్రాండ్ల అమ్మకాలు పడిపోతాయి. అందువల్ల, విదేశీ మద్యం ధరలను పెంచడం ద్వారా, వాటి కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశ్యం ఉంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News