Indiramma Housing Scheme: ఇందిరమ్మ హౌసింగ్ స్కీంపై అదిరపోయే అప్ డేట్.. వాళ్లకి రూ.లక్ష జమ

Telangana Government Announces Key Update on Indiramma Housing Scheme
x

Indiramma Housing Scheme: ఇందిరమ్మ హౌసింగ్ స్కీంపై అదిరపోయే అప్ డేట్.. వాళ్లకి రూ.లక్ష జమ

Highlights

Indiramma Housing Scheme: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తోంది.

Indiramma Housing Scheme: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వ విధానం ప్రకారం, స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇచ్చే ప్రతిపాదనపై ఇప్పటికే పని జరుగుతుంది. జనవరి 21వ తేది నుంచి ప్రారంభమైన ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం వారికి రూ.లక్ష నగదును జమ చేయనుంది.

ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ మొదటి విడత నిధులను రాష్ట్రంలోని పేదల కొరకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద రూపాయి 5 లక్షలు సహాయం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిధులు మొదటగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన లబ్దిదారులకు అందించబడతాయి. పునాది వేయడంతో పాటు, ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం నిధులతో కలిసి రూ. 1 లక్ష నగదు మొదటి విడతగా ఇవ్వబడుతుంది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత, ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి కోట్లు సిద్దంగా ఉంచింది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద రాష్ట్రంలో 3500 మందికి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకం ఆధారంగా ఇంటిగ్రేటెడ్ ఈ-కేవైసీ యాప్ ని ప్రారంభించింది.

దీని ద్వారా సొంతింటి కోసం నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు తమ ఇంటి కేటాయింపు జాబితాలో తమ పేర్లను తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ఆధారంగా ఈ యాప్‌లో లాగిన్ చేసి వారు ఇళ్ల కేటాయింపును చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మెరుపు వేగంతో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టబడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories