అమెరికా విమానాలు అమృత్‌సర్‌లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు.. పంజాబ్ సీఎం అనుమానాలు

Punjab CM Bhagwant Mann qyestions Why US deportation flights landing in Amritsar
x

 అమెరికా విమానాలు అమృత్‌సర్‌లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు.. పంజాబ్ సీఎం అనుమానాలు

Highlights

Why US deportation flights landing in Amritsar: అమెరికా తమ దేశంలో ఉంటున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కు పంపిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే...

Why US deportation flights landing in Amritsar: అమెరికా తమ దేశంలో ఉంటున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కు పంపిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అమెరికా నుండి 119 మంది భారతీయులతో రెండో విమానం ఇండియాకు బయల్దేరింది. శనివారం రాత్రి 10 గంటలకు ఆ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అవనుంది.

అమెరికా నుండి వస్తోన్న రెండో మిలిటరి విమానంలో ఏయే రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారంటే..

సీరియల్ నెంబర్రాష్ట్రంప్రయాణికుల సంఖ్య
1పంజాబ్67
2హర్యానా33
3గుజరాత్8
4ఉత్తర్ ప్రదేశ్3
5గోవా 2
6

మహారాష్ట్ర

2
7రాజస్థాన్2
8హిమాచల్ ప్రదేశ్1
9జమ్మూ కశ్మీర్1


119

అందుకే అమృత్‌సర్‌ను ఎంచుకున్నారు - పంజాబ్ సీఎం భగవంత్ మాన్

గత వారం 104 మంది భారతీయులతో అమెరికా పంపించిన మిలిటరీ విమానం అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అయింది. అయితే, వరుసగా రెండో విమానం కూడా అమృత్‌సర్‌లోనే దిగనుండటంపై ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కేంద్రంపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. "అమెరికా పంపిస్తోన్న డిపోర్టేషన్ ఫ్లైట్‌లో దేశంలోని అనేక ప్రాంతాల వారు ఉన్నారు. అలాంటప్పుడు ఆ విమానం దేశ రాజధాని ఢిల్లీలో దిగకుండా అమృత్‌సర్‌కే ఎందుకు పంపిస్తున్నట్లు" అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని భగవంత్ మాన్ ఆరోపించారు.

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భేటీ అయిన సందర్భంలోనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ రెండో విమానంలో పంపించే భారతీయులకు సంకెళ్లు వేసి ఉంటారు. ఇదేనా ట్రంప్ ఇండియాకు ఇచ్చిన గిఫ్ట్ అని భగవంత్ మాన్ నిలదీశారు.

"పంజాబ్ అంటే ముందు నుంచీ కేంద్రానికి నచ్చదు. పంజాబ్ ప్రతిష్ట దెబ్బతీయడానికి కేంద్రం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోదు. అందుకే ఇప్పుడు కూడా అమెరికా విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండ్ చేయిస్తోంది" అని భగవంత్ మాన్ అన్నారు.

భగవంత్ మాన్ ఆరోపణలపై స్పందించిన బీజేపి

భగవంత్ మాన్ ప్రతీ చిన్న విషయాన్ని, సున్నితమైన విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపి ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాల్ కౌంటర్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులుక దేశ భద్రత అస్సలే పట్టదని ప్రవీణ్ అన్నారు.

బీజేపి జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ కూడా భగవంత్ మాన్ ఆరోపణలపై స్పందించారు. అమెరికా నుండి ఇండియాలోకు వచ్చే అంతర్జాతీయ విమానాలకు సమీపంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అమృత్‌సర్ కనుక ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు ఆర్పీ సింగ్ చెప్పారు. కనీస పరిజ్ఞానం కూడా లేకుండానే భగవంత్ మాన్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన బదులిచ్చారు.

Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్‌ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?

Who Is Shivon Zilis: మస్క్, మోదీ భేటీలో ఈ లేడీ ఎవరు?

అమెరికా నుండి అక్రమవలసదారుల డిపోర్టేషన్ ఫ్లైట్స్ విషయంలో ఆర్ధికంగా వెనుకబడిన అంత చిన్న దేశమైన కంబోడియా చేసిన పని భారతీయుల కోసం ఎన్డీఏ సర్కార్ చేయలేదా అంటున్న విపక్షాలు

Show Full Article
Print Article
Next Story
More Stories