Cyclone Tauktae 2021: కరోనాతో తల్లడిల్లుతున్న భారత్‌కు మరో ముప్పు

Cyclone Tauktae 2021: అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాన్‌ ఉత్తర వాయవ్య దిశగా దూసుకువస్తుంది.

Update: 2021-05-15 06:45 GMT
Tauktae Cyclone (File Image)

Cyclone Tauktae 2021: కరోనాతో తల్లడిల్లుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉంది. అది ఇప్పుడు తుఫాన్‌ రూపంలో వస్తోంది. అదే తౌక్టే తుఫాన్. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాన్‌ ఉత్తర వాయవ్య దిశగా దూసుకువస్తుంది. దాని స్పీడ్‌ చూస్తుంటే రాత్రి వరకు తీవ్ర తుఫాన్‌ మారే చాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇదే నిజమైతే గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీ్‌వులు‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో భీకర వర్షాలు తప్పవు.

తౌక్టే తుఫాన్ మంగళవారం ఉదయం గుజరాత్‌ తీరం దాటే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. గుజరాత్‌ తీరంలో గంటకు 150-160 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయట. దీనిప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీ్‌ప్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.

అరేబియాలో ఏర్పడిన వాయుగుండం రాయలసీమపై కొంతవరకూ ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. కాగా నిన్న కోస్తా, రాయలసీమల్లో వర్షం తన సత్తా చూపించింది.

Tags:    

Similar News