Tata Steel: కరోనాతో ఉద్యోగి మరణిస్తే ఫ్యామిలీకి జీతం - టాటా సంచలనం నిర్ణయం

Tata Steel: టాటా గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2021-05-25 10:30 GMT

టాటా స్టీల్ (ఫొటో ట్విట్టర్)

Tata Steel: టాటా గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలను కాపాడుకోవడంలో టాటా గ్రూప్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఫస్ట్ వేవ్‌లో కోవిడ్ రూ.1500 కోట్లు విరాళంగా ఇచ్చి ఉదారతను చాటిన టాటా గ్రూప్.. తాజాగా కరోనాతో తమ ఉద్యోగులు మరణిస్తే.. ఉద్యోగి కుటుంబానికి జీతం అందిస్తామని ప్రకటించింది. సోషల్ సెక్కూరిటీ స్కీమ్ కింద ఈ సహాయం చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసింది.. ''టాటా స్టీల్‌... తమ ఎంప్లాయి కుటుంబాలు, వారు మెరుగైన జీవనం సాగించేందుకు తన వంతు సహాయం చేస్తుంది. ఒకవేళ మా ఉద్యోగి కోవిడ్‌ కారణంగా చనిపోతే, సదరు కుటుంబానికి జీతం అందజేస్తాం. ఎంప్లాయి చనిపోయే నాటికి ఎంత మొత్తమైతే వేతనంగా పొందుతున్నాడో, అంతే మొత్తాన్ని ఆ వ్యక్తి 60 ఏళ్లు వచ్చేంత వరకు వారి కుటుంబానికి అందజేస్తుంటాం. వైద్య, గృహపరమైన లబ్ది పొందేలా సహాయం చేస్తాం.

అంతేగాక, ఒకవేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మరణిస్తే, పూర్తి స్థాయి జీతంతో పాటు సదరు ఎంప్లాయి పిల్లలు గ్రాడ్యుయేషన్‌(ఇండియాలో) పూర్తి చేసేంత వరకు ఖర్చులన్నీ మేమే భరిస్తాం'' అని ట్విట్టర్లో ప్రకటించింది. తమ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన నిర్ణయమని పేర్కొంది. ఈ నిర్ణయంతో టాటా స్టీలు కంపెనీ యాజమాన్యంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా... టాటా ట్రస్టు చైర్మన్‌ రతన్‌ టాటా దాతృత్వాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. 



Tags:    

Similar News