Tamilnadu: 7 సార్లు అబార్షన్ చేయించుకున్న నటి.. న్యాయమూర్తి తీర్పులో కీలక విషయాలు
Tamilnadu: 7 సార్లు అబార్షన్ చేయించుకున్న నటి.. న్యాయమూర్తి తీర్పులో కీలక విషయాలు
Tamilnadu: నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త పెళ్లి చేసుకుంటానని మోసానికి పాల్పడటంతో విజయలక్ష్మీకి 7సార్లు అబార్షన్ జరిగిందని..సీమాన్ పై కేసు తీవ్రమైందని హైకోర్టు తన వివరణాత్మక తీర్పులో పేర్కొంది. నటి విజయలక్ష్మీ లైంగిక వేధింపులకు గురిచేసిటనట్లు సీమాన్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై 2011లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సీమాన్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఇళంతిరైయన్ ఈనెల 17న తీర్పును వెలువరించారు.
అందులో కేసు రద్దు చేయడం కుదరదని..ఈ కేసులో 12 వారాల్లోకా తుది నివేదిక దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించి పిటిషన్ కొట్టేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ ఇళంతిరైయన్ జారీచేసిన వివరణాత్మక తీర్పు ప్రస్తుతం వెలువడింది. అందులో దర్శకనటుడు, ప్రస్తుతం రాజకీయ నేతగా ఉన్న సీమాన్ దర్శకత్వం వహించిన సినిమాలో విజయలక్ష్మీ నటించారన్నారు. అప్పుడు ఏర్పడిన పరిచయం కారణంగా తన కుటుంబ సమస్య పరిష్కారానికి సీమాన్ ను ఆమె సంప్రదించారని చెప్పారు.
ఈ క్రమంలో ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోకుండా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేసిందని..ఇందుకు సీమాన్ ఇరువురి ఆమోదంతో జరిగింది లైంగిక నేరం కాదని 2011లో ఇచ్చిన ఫిర్యాదుని విజయలక్ష్మీ 2012లో వెనక్కి తీసుకున్నారని వాధించారన్నారు. కానీ అందరి ముందు తనను వివాహం చేసుకుంటానని ఇచ్చిన హామీని నమ్మి ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నట్లు విజయలక్ష్మీ తిరువళ్లూర్ మహిళా కోర్టులో వాగ్మూలం ఇఛ్చారని పేర్కొన్నారు.
ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు న్యాయవాదికి ఆమె ఇచ్చిన లేఖ సంబంధిత పోలీస్ ఇన్ స్పెక్టరుకు చేరలేదని తెలిపారు. దీంతో ఆ ఫిర్యాదు పెండింగ్ లో ఉందన్నారు. ఈ కేసులో 15మంది దగ్గర వాగ్మూలం పొందినట్లు ప్రభుత్వం తరపున తెలిపారని..ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదన్నారు. ఆయన వల్ల బాధితురాలు సుమారు 7 సార్లు అబార్షన్ చేయించుకున్నారని తెలిపారు. అంతేకాదు విజయలక్ష్మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సీమాన్ పొందారని మానసిక ఒత్తిడి, బెదిరింపుల కారణంగా ఆె ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. సీమాన్ పై లైంగిక ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఇందులో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ రాజీ చేసుకోవడం కుదరదన్నారు. 2023 వరకు ఇద్దరి మధ్య ఏదో ఒకరకంగా సంబంధం ఉందని ఆయనపై లైంగిక వేధింపుల కేసు రద్దు చేయడం కదరదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.