Tamil Nadu: తమిళనాడులో జూన్ 28 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు
Tamil Nadu: కోవిడ్ కట్టడిలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Tamil Nadu: తమిళనాడులో జూన్ 28 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు
Tamil Nadu: కోవిడ్ కట్టడిలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కొన్ని సడలింపులతో జూన్ 28వరకూ పొడిగించింది. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్ రేపు ఉదయం 6గంటలకు ముగియనుండడంతో కొనసాగింపు నిర్ణయం తీసుకుంది. ఇక రేపటి నుంచి అమల్లో ఉండనున్న లాక్‌డౌన్‌లో కొన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం షాపులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది.
మరోవైపు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ సిటీ బస్ ట్రాన్స్‌పోర్ట్‌ను చెన్నై సహా నాలుగు జిల్లాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపవచ్చునని తెలిపింది. మెట్రో రైలు సేవలు కూడా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ-రిజిస్ట్రేషన్ లేకుండా ఆటోరిక్షాలు, రెంటల్ క్యాబ్‌లను నడపవచ్చునని పేర్కొంది.