Tamil Nadu: శశికళపై మాట మార్చిన పన్నీర్ సెల్వం
Tamil Nadu: తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు.
Tamil Nadu: శశికళపై మాట మార్చిన పన్నీర్ సెల్వం
Tamil Nadu: తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి వస్తానన్న ప్రతిపాదనలు వస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తామని అన్నారు. అయితే, అన్నాడీఎంకే వ్యక్తులపై గానీ, కుటుంబాలపైన కానీ ఆధారపడదన్నారు. శశికళపై తనకు ఎలాంటి కోపమూ లేదని, నిరాశ కూడా లేదన్న పన్వీర్ సెల్వం శశికళ, దినకరన్‌ను తానెంతో గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. శశికళ తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆమె ఇష్టమన్నారు. రాజకీయాల్లో రాజీలు పడటం సహజమని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు పన్నీర్ సెల్వం.