M K Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
M K Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
M K Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
M K Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆయన సాధారణంగా మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆకస్మికంగా ఆయనకు తల తిరిగినట్టు అనిపించింది. వెంటనే అప్రమత్తమైన సహాయకులు, కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
అసుపత్రికి చేరే సమయంలో స్టాలిన్ కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ వార్త వెలుగులోకి రాగానే పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. సీఎం ఆరోగ్యంపై క్లారిటీ రావాల్సిందిగా వేచి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ.."స్టాలిన్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేశాం. ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు" అని తెలిపారు.
ప్రస్తుతం సీఎం స్టాలిన్ విశ్రాంతి తీసుకుంటుండగా, వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. అభిమానులు ఊపిరి పీల్చుకునేలా ఈ ప్రకటన కొంతవరకూ ఊరటనిస్తోంది.