Tallest Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన

* మణిపూర్ - ఇంపాల్‌ మధ్య 111 కి.మీ. పొడవైన రైల్వే వంతెన * నిర్మాణం పూర్తయితే కేవలం రెండు నుంచి రెండున్నర గంట్లోనే ప్రయాణం

Update: 2021-11-28 03:57 GMT

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన(ఫైల్ ఫోటో)

Tallest Bridge: మరో ఎత్తయిన వంతెన నిర్మాణం చేపట్టింది భారతీయ రైల్వే. మణిపూర్‌లోని జిరిబర్ - ఇంఫాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 111 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు నుంచి రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు.

ప్రస్తుతం జిరిబర్ - ఇంఫాల్ మధ్య రైలు మార్గం లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డు మార్గంలో జిరిబమ్ నుంచి ఇంపాల్‌కు 220 కిలోమీటర్ల దూరం. ఈ మార్గంలో ప్రయాణానికి 10 నుంచి 12గంటల సమయం పడుతోంది.

అందుకే దూరాన్ని, సమయ భారాన్ని తగ్గించడం కోసం నోనీ లోయ మీదుగా రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఎత్తయిన స్తంభాల వంతెనగా ప్రపంచంలోనే గుర్తింపు పొందనుంది.

Tags:    

Similar News