Survey on Schools Reopening: పాఠశాలలు ప్రారంభించడంపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు!

Update: 2020-07-22 09:51 GMT

Survey on Schools Reopening in India : కరోనా వైరస్ విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేసింది. నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమ్యారు విద్యార్థులు. సాధారణంగా ఈ సమయానికి స్కూళ్లలో బిజీబిజీగా ఉండేవారు. కాని కరోనా ప్రభావంతో స్కూల్స్‌ ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. తరగతుల ప్రారంభం విషయంలో రాష్ట్రాలకు కేంద్రం రాసిన లేఖ ఏమిటి..? రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి..?

దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఎప్పుడు ప్రారంభం అవుతాయో కూడా తెలియదు. ఈ నేపధ్యంలో పాఠశాలలు, విద్యా సంస్థల పున: ప్రారంభంపై తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు కేంద్రం లేఖలు పంపింది. విద్యార్ధుల తల్లి దండ్రుల నుండి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని అందజేయాలని ఆదేశించింది. విద్యార్ధులు పాఠశాలకు వెళ్లేందుకు వారికి అనుకూలమైన నెల ఆగష్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో ఏది వీలవుతుందో అడిగి తెలుసుకోవాలని ఇందులో సూచించారు. ఒకవేళ పాఠశాలు, విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి విద్యార్ధులు తల్లిదండ్రులు ఏయే అంశాలు ఆశిస్తున్నారో కూడా అడిగి సేకరించాలని కోరారు.

ఈ సందర్భంగా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారనే సమాచారం రాష్ట్రాలను కోరింది. పలు రాష్ట్రాలు తమ తమ రాష్ట్రంలో విద్యా ఏడాది ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి నివేదించాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏపీలో సెప్టెంబర్‌లో ప్రారంభం చేస్తామని బీహార్‌, ఢిల్లీ రాష్ట్ర్రాలు ఆగష్టులో పాఠశాలలు తెరిచేందుకు యోచిస్తున్నాయి. కాగా తెలంగాణ, తమిళనాడులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో వర్క్‌షాప్‌ నిర్వహించి నిపుణుల అభిప్రాయాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. తెలంగాణలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకునేందుకు సన్నద్దమవుతోంది.

ప్రస్తుతం విద్యాసంస్థల ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ప్రయత్నాలు ఆరంభించింది. ఈ అంశంపై ఇతర వివరాలు, పేరెంట్ల నుంచి సమగ్రమైన సమాచారంతో పాటు రిమార్కులను సేకరించేందుకు సిద్దమైంది. చూడాలి దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా విద్యా సంస‌్థలు ప్రారంభం అవుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Tags:    

Similar News