కరోనా నేపథ్యంలో బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం

కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్‌ ప్రభు ప్రస్తుతం స్వీయ నిర్బంధం విధించుకున్నారు.

Update: 2020-03-18 08:09 GMT
Suresh Prabhu (file photo)

కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్‌ ప్రభు ప్రస్తుతం స్వీయ నిర్బంధం విధించుకున్నారు. భారత్‌ తరపున జీ20 సదస్సు ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చారు. విదేశాలకు వేలి రావడంతో సురేష్ ప్రభు కు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్‌ అని వచ్చింది. అయినా కూడా ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్ద్యేశంతో 14 రోజులపాటు హోమ్‌ క్వారైంటన్‌లో ఉంటున్నారు. దీంతో పార్లమెంట్‌ సమావేశాలకు దూరం కానున్నారు.

తన స్వీయ నిర్బంధం విషయాన్నీ రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు లేఖ ద్వారా వెల్లడించారు. అందులో 'రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్‌ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి వెళ్ళాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. రిజల్ట్‌ నెగటివ్‌గానే వచ్చింది.

అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఐసోలేషన్‌ సమయం ముగిసేవరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాను. పార్లమెంటు సభ్యులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ సురేష్‌ ప్రభు వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Tags:    

Similar News