Surekha Yadav: దేశంలోనే తొలిసారి వందే భారత్ రైలును నడిపిన మహిళగా రికార్డు..
Surekha Yadav: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
Surekha Yadav: దేశంలోనే తొలిసారి వందే భారత్ రైలును నడిపిన మహిళగా రికార్డు..
Surekha Yadav: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో సత్తా చాటుతూ తామేంటో నిరూపిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్క్షానంతో కూడిన వందే భారత్ రైళ్లను సైతం నడిపిస్తూ మాకు మేమే సాటి అని మహిళలు నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబైలో వందే భారత్ రైలును సురేఖా యాదవ్ అనే లోకో పైలెట్ నడిపి రికార్డు సృష్టించారు. దేశంలోనే తొలిసారి వందే భారత్‌ను నడిపిన మహిళగా సురేఖ యాదవ్ చరిత్ర సృష్టించారు. 160 కిలోమీటర్లకుపైగా మెరుపు వేగంతో వందే భారత్ రైలు దూసుకెళ్తున్నా...ఏమాత్రం భయపడకుండా, అత్యంత ధైర్యంగా రైలును నడిపి శభాష్ అనిపించుకున్నారు సురేఖ యాదవ్.