Uttar Pradesh: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌

Uttar Pradesh: కాంవడ్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం * థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందని నిపుణులు చెబుతుంటే

Update: 2021-07-14 08:21 GMT

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీమ్ కోర్ట్ సీరియస్ (ఫైల్ ఇమేజ్)

Uttar Pradesh: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ఈనెల 25 నుంచి కాంవడ్ యాత్ర జరపడానికి అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కరోనా థర్డ్‌ వేవ్‌పై హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఎలా యాత్రకు పర్మిషన్ ఇస్తారంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు ఈ కాంవడ్‌ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో శివ భక్తులు గంగా నదీ జలాలను సేకరిస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య, పరిమిత సంఖ్యలోనే కాంవడ్ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. యాత్రకు వచ్చే భక్తులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ కూడా తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రం ఉత్తరాఖండ్ కాంవడ్ యాత్రను రద్దుచేస్తున్నట్లు ప్రకటించగా యూపీ అనుమతి ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది స్వయంగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.

Full View

 

Tags:    

Similar News