Delhi: ఢిల్లీలో ఇవాళ్టి నుంచి స్కూల్స్ మూసివేత

విద్యాసంస్థలు తెరవడంపై సుప్రీంకోర్టు సీరియస్

Update: 2021-12-03 02:15 GMT

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి స్కూల్స్ మూసివేత

Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో ఇవాళ్టి నుంచి స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖామంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. అయితే ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు కాలుష్య పరిస్థితుల్లో స్కూళ్లు తిరిగి తెరవడంపై గురువారం ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. మూడు, నాలుగేళ్ల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని తాము పాఠశాలలను తిరిగి ప్రారంభించామని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయన్నారు. ఈ క్రమంలోనే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూళ్లను ఇవాళ్టి నుంచి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Tags:    

Similar News