Supreme Court: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.
Supreme Court: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె. శంకర అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
పిటిషనర్ కె. శంకర తన పిటిషన్‌లో సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య ఎన్నికను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసింది.