Hardik Patel: మార్చి 6 వరకు హార్దిక్ పటేల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు

2015 లో గుజరాత్‌లో పాటిదార్ ఉద్యమం సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించి తనపై నమోదైన కేసులో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు మార్చి 6 వరకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2020-02-28 07:11 GMT
హార్దిక్ పటేల్ (ఫైల్ ఫోటో)

2015 లో గుజరాత్‌లో పాటిదార్ ఉద్యమం సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించి తనపై నమోదైన కేసులో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు మార్చి 6 వరకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై ఉన్న కేసును రద్దు చేయాలని కోరుతూ పటేల్ చేసిన విజ్ఞప్తిపై న్యాయమూర్తులు యుయు లలిత్, వినీత్ శరణ్ ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2015 హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలోని పాటిదార్ అనామత్ అండోలన్ సమితి కోటా ఉద్యమం నిర్వహించింది.

అందులో భాగంగా అహ్మదాబాద్‌లో మెగా ర్యాలీని నిర్వహించింది, ఈ కార్యక్రమానికి అవసరమైన అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నారు.. అయితే ఆ ర్యాలీలో హింస చెలరేగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దాంతో దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ పై కూడా కేసు నమోదయింది. అప్పటినుంచి విచారణ పెండింగులో ఉంది. తాజాగా ఈ కేసు విషయంలో హార్దిక్ పటేల్ కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం.

Tags:    

Similar News