గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్‌చిట్‌..

Narendra Modi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు ప్రధానమంత్రి మోడీకి క్లీన్ చిట్‌ ఇచ్చింది.

Update: 2022-06-24 12:15 GMT

గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్‌చిట్‌..

Narendra Modi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు ప్రధానమంత్రి మోడీకి క్లీన్ చిట్‌ ఇచ్చింది. ఇంతకుముందే అల్లర్లలో మోదీ పాత్ర లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చి చెప్పింది. అయితే అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన అప్పటి ఎంపీ ఎహ్సాన్‌ జాఫ్రి భార్య జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో మోడీకి మరోసారి క్లీన్ చిట్‌ లభించింది. 2002లో జరిగిన ఈ అల్లర్లలో వెయ్యి మంది దాకా మృతి చెందారు. గుజరాత్‌లోని గోద్రా సహా పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. అప్పట్లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నారు. అప్పట్లో మోడీతో పాటు పలువురి పాత్రపై ఆరోపణలు వచ్చాయి.

గుజరాత్‌ అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టి 2012 ఫిబ్రవరి 8న మోడీతో పాటు ఇతరులకు క్లీన్‌ చిట్‌ ఇస్తూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. పలుమార్లు వాదోప వాదనలు విన్న తరువాత సిట్‌ ఇచ్చిన క్లీన్ చిట్ సరైనదేనని సుప్రీంకోర్టు బెంచ్‌ అభిప్రాయపడింది. జాకియా జాఫ్రి పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో 20 ఏళ్లుగా మోడీని వెంటాడుతున్న ఈ కేసులో ఊరట లభించినట్టయ్యింది.

Tags:    

Similar News